
గుండె పోటు.. హార్ట్ ఎటాక్.. ఎలా పిలిచినా సరే దీని బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం మన దేశంలోనేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏటా హార్ట్ ఎటాక్ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు సరైన సమయంలో స్పందించడం అవసరం. లేకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇక హార్ట్ ఎటాక్ వచ్చేముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి హార్ట్ ఎటాక్ రిస్క్ ఉన్నవారిలోనూ నెల రోజుల ముందు నుంచే శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ వాటిని చాలా మంది పట్టించుకోరు. ఆ లక్షణాలను గమనించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే హార్ట్ ఎటాక్ వచ్చే నెల రోజుల ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జలుబు, ఫ్లూ జ్వరం తరచూ వస్తున్నాయా ? అవి అసలు తగ్గడం లేదా ? అయితే అవి హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు. దీంతోపాటు దగ్గు బాగా వస్తున్నా కూడా అనుమానించాల్సిందే. అది కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఓ సూచికలా మనకు కనిపిస్తుంది. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా దీర్ఘకాలికంగా ఉంటే ఎందుకైనా మంచిది వారు గుండె సంబంధ వైద్య పరీక్షలు చేయించుకుని అవసరం అనుకుంటే చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు.
2. శ్వాస సరిగ్గా ఆడకపోవడం, గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే అవి హార్ట్ ఎటాక్‌కు సూచికలు కావచ్చు.
3. ఛాతిలో బాగా అసౌకర్యంగా ఉండడం, బాగా బరువు పెట్టి ఛాతిపై ఒత్తినట్టు అనిపించడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్‌కు సూచనలు. ఈ లక్షణాలు గనక ఎవరికైనా ఉంటే ఆలస్యం చేయరాదు. వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
4. బాగా మత్తుగా ఉండి నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు బాగా వస్తున్నా ఈ లక్షణాలు హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాలి.
5. బాగా అలసిపోవడం, ఎప్పుడూ ఒళ్లు నొప్పులుగా ఉండడం తదితర లక్షణాలు చాలా కాలం నుంచి ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయరాదు. అవి హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు కావచ్చు.
6. ఎల్లప్పుడూ వికారంగా ఉంటుండడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ రావడం, కడుపు నొప్పిగా ఉండడం తదితర లక్షణాలన్నీ హార్ట్ ఎటాక్‌కు సూచికలు. చాలా మంది గుండెలో వచ్చే నొప్పిని అసిడిటీ వల్ల ఛాతిలో వచ్చే నొప్పి అనుకుని భ్రమ పడుతుంటారు. ఇలాంటి నొప్పి ఉంటే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అన్ని పరీక్షలు చేయించుకుని అవసరం అయితే మందులు వాడాలి.
7. కళ్ల చివరన కురుపులు వస్తుంటే అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచనలుగా నిలుస్తాయి.
8. కాళ్లు, పాదాలు, మడమలు ఎప్పుడూ ఉబ్బిపోయి ఉంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సంకేతాలుగా నిలుస్తాయి.
9. ఎడమ దవడలో మొదలయ్యే నొప్పి భుజం మీదుగా ఎడమ చేయి కింద దాకా వస్తుంటే దాన్ని కచ్చితంగా హార్ట్ ఎటాక్‌కు సూచనలా భావించాలి. ఇలా వచ్చే నొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. అది కచ్చితంగా హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సంకేతం. కనుక వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ నొప్పి ఒక్కోసారి గొంతులో కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
10. గుండె సమస్యలు ఉన్నవారికి హార్ట్ బీట్ రేట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. అలా ఉండకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. హైబీపీ ఉన్న వారికి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1 comments:
Click here for commentsNo more live link in this comments field
ConversionConversion EmoticonEmoticon